05 Jul 2026 | 02:36 PM

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సిరంశెట్టి భవాని ప్రసాద్‌కు రూ.2,00,630 ఎల్ఓసి అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా, జగ్గంపేట, జూన్ 23: అక్షర ఆయుధం ప్రతినిధి : జగ్గంపేటలోని రావులమ్మ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గోకవరం మండలం కామరాజుపేట శివారు సూదికొండకు చెందిన సిరంశెట్టి భవాని ప్రసాద్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.2,00,630 లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి) ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం 22-06-2026న జారీ చేసిన LOC నెం.222936 ప్రకారం, రాజమహేంద్రవరం అపెక్స్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందేందుకు ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ ఎల్ఓసి మంజూరైంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అత్యవసర వైద్యం కోసం నన్ను సంప్రదిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వైద్యం కోసం ముందస్తు నిధులు ఎల్వోసీ ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి కన్నబాబు, ఆర్యవైశ్య రాష్ట్ర డైరెక్టర్ కొత్తకొండ బాబు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు కందుల చిట్టిబాబు, జిల్లా టిడిపి కార్యదర్శి చదరం చంటిబాబు, తంటికొండ దేవస్థానం చైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొర, టిడిపి యువనేత మైలవరపు రఘు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper