05 Jul 2026 | 02:36 PM

చెరువు కాల్వ పూడికతీత

వలిగొండ జూన్ 29 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : మండల పరిధిలోని వేములకొండ గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్ ఏర్పుల వెంకటేశం ఆధ్వర్యంలో చెరువు కాలువ పూడికతీత నిర్వహించారు.గ్రామంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.గ్రామ రైతులకు సాగునీరు అందించడానికి ప్రజల సహకారంతో కృషి చేస్తున్న సర్పంచ్,పాలకవర్గాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంబటి సాయికుమార్ వార్డు సభ్యులు కట్ట జ్యోతి అశోక్,అంబటి గిరిబాబు,ఏర్పుల పద్మ యాదయ్య,కాడిగళ్ల రామనర్సింహ,ఇంజమూరి శ్రీను, పులిపలుపుల అండాలు మల్లేశం,బత్తుల సువర్ణ మల్లేష్,సలబద్రి అభినయ్,మాడుగుల స్వర్ణలత శేఖర్ నాయకులు పులిపలుపుల రాములు మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ రసూల్ నాయకులు ఏనుగుల నర్సింహ,ఏర్పుల గంగయ్య,పట్టేటి జగన్,సాధుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper