వలిగొండ జూన్ 26 అక్షరయుధం ప్రతినిధి మారగోనిశ్రీనివాస్ గౌడ్ : వలిగొండ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు తెలంగాణ ఉద్యమకారుల బంధువుగా మారి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కొరకు కేశవరావు కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతగా కొడంగల్ నియోజకవర్గం చేవెళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఆదివారం 28 తారీఖున ఉదయం 11 గంటలకు 100 కారులతో కృతజ్ఞత భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ ర్యాలీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు బత్తిని రవి,బత్తిని సహదేవ్ గౌడ్, కొండూరు సత్తయ్య, మల్లం వెంకటేశం, బొడిగే సుదర్శన్, కొండూరు శ్రీరాములు, దండ మల్లికార్జున్ , పారుపల్లి నరసింహ,ఎదురుగట్ల పెద్ద యాదగిరి, చిన్న యాదగిరి,పల్లెర్ల రామచంద్రు, ఎదురుగట్ల సందయ్య, ఎదురుగట్ల లక్ష్మయ్య, తెలంగాణ ఉద్యమకారుల మహిళ అధ్యక్షురాలు ఐటిపాముల పుష్ప తదితరులు పాల్గొన్నారు