వలిగొండ జూన్ 27 అక్షర అయుధం ప్రతినిధి *ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో జరిగే కృతజ్ఞత ర్యాలీ బ్యానర్ ను ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు కేకే కమిటీని నియమించిందని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతిని ప్రతిహామీని నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఉద్యమకారులు చేపట్టే కృతజ్ఞత ర్యాలీ కార్యక్రమం అభినందనీయమని ఫోరం నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, ఉపసర్పంచ్ మల్గ మాధవి,ఉద్యమకారుల ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి,కళ్లెం లక్ష్మారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని రవీందర్ గౌడ్, గౌరవ సలహాదారుడు బత్తిని సహదేవ్ గౌడ్, పాశం సత్తిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పల్సం సతీష్ గౌడ్ , గరిసె రవి,చిలుగూరి సత్తిరెడ్డి, కదిరేని స్వామి, బోడిగె సుదర్శన్,ఐటిపాముల పుష్ప, దండ మల్లికార్జున్, కొండూరు సత్తయ్య,ఎదురుగట్ల పెద్దయాదగిరి, చిన్న యాదగిరి, లక్ష్మయ్య,సందయ్య, తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.