05 Jul 2026 | 03:32 PM

నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగించిన బీఎస్పీ నాయకులు

అక్షర ఆయుధం న్యూస్:(రిపోర్ట్ కృష్ణ ఇంచార్జ్)26 మే రాయదుర్గం నియోజవర్గంలో నందు అనంతపురం లో కొత్తూరు లక్ష్మీనారాయణపై దాడి జరిగిన విషయం గురించి బహుజన సమాజ్ కార్యదర్శి చిందునురు నాగరాజు ఆధ్వర్యంలో* గద్దెల నాగభూషణ పోలీసు వ్యవస్థ నిందితులకు కాపలా కాయడానికి ఉందా? లేదా బాధితులకు అండగా నిలబడటానికి ఉందా?- హరి ప్రసాద్ న్యాయవాది బిఎస్పీ నాయకులు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం నుండి....సీనియర్ విలేకరి కొత్తూరు లక్ష్మి నారాయణ పైన శ్రీ గీతం కాలేజీ యాజమాన్యం చైర్మన్ మనీషా నాయర్ మరియు ఆమె అనుచరులు దాడి చేసి నేటికి 24 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదని తక్షణం అరెస్ట్ చేయాలినీ డిమాండ్ చేస్తూ కొనసాగింది.బిఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు మరియు రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం ఆధ్వర్యంలో మొదలైన రిలే దీక్షలు రెండవ రోజు విజయవంతంగా పూర్తి చేసారు ఉదయం 10:00 గంటలకు మొదలై 5:00 గంటలకు వరకు నిరాహార దీక్ష ముగిస్తుంది నేను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష రెండవ రోజు దీక్షలో పాల్గొన్నాను. మొదటి రోజు విజయవంతంగా ముగిసిన ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తూ,ఈ రోజు కూడా హరిప్రసాద్ న్యాయవాది బిఎస్పీ నాయకులు ప్రభాకర్,రామాంజినేయులు గుత్తి, ఈశ్వరయ్య, ఓబులేసు, సుధాకర్ రాప్తాడు నుంచి, నాగవేణి మహిళా నాయకురాలు వీరందరూ శరీర బాధను పణంగా పెట్టి ఈ రోజు దీక్షలో కూర్చున్నారు.సీరియస్ ప్రశ్నలు దీక్షా శిబిరం ఒక దళిత / ఎస్సీ / ఎస్టీ సీనియర్ విలేకరి కొత్తూరు లక్ష్మి నారాయణ మరియు అతని కుటుంబం పైన దారుణంగా దాడి చేసి దాదాపు 24 రోజులు అయినప్పటికీ, నిందితులు ఇప్పటికీ ఎందుకు ఇంకా బయట తిరుగుతున్నారు?ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నా ఎందుకు సరిగ్గా అమలు కావడం లేదు పోలీసు వ్యవస్థ నిందితులకు కాపలా కాయడానికి ఉందా? లేదా బాధితులకు అండగా నిలబడటానికి ఉందా?ఇంత భారీ ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు మౌనం వహిస్తోంది? ఎంతకాలం ఈ నిర్లక్ష్యం కొనసాగించాలనుకుంటున్నారు?మా డిమాండ్లు స్పష్టంగాఉన్నాయి:నిందితులను తక్షణం అరెస్టు చేయాలి.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కఠినంగా అమలు చేయాలి.పోలీసులు బాధితుల పక్షాన నిలబడి, న్యాయం చేయాలి.ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం చూపాలి.మేము నిరాహార దీక్ష చేస్తున్నాం కేవలం ఒక కేసు కోసం మాత్రమే కాదు — ప్రతి దళితుడు, ప్రతి బహుజనుడు సురక్షితంగా జీవించాలని, సామాజిక న్యాయం సాధించాలని..ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేసే ధైర్యం, నిబద్ధత ఉందా? లేదా ఇంకా కుల రాజకీయాలు, ఒక వర్గం పక్షపాతం కొనసాగుతాయా?ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం త్వరగా స్పందించాలి. లేకపోతే ఈ రిలే నిరాహార దీక్ష మరింత బలంగా, విస్తృతంగా కొనసాగుతుంది.జై భీమ్! జై భారత్!జై బహుజన్!!ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెండవ రోజు దీక్షకు మద్దతు తెలిపిన వారు ఎం నారాయణస్వామి మానవ హక్కుల సంఘం చైర్మన్ రామనాథరెడ్డి, మంజునాథరెడ్డి,ఆర్గానిక్ రైతు సంఘం నాయకులు కుమార్ రాజా జగదీష్ సామ్రాట్ కేబీ మధు మాదిగ రైతు మహాజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బాల పెద్ధన మాజీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బిబి4 మీడియా చాకలి శ్రీరాములు రైతు మహాజన పార్టీ నాయకులు దాసరి రామ్మూర్తి మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షులుదారా శంకర్ జెబిపి పార్టీ నాయకులు మరియు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు అతిథులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper