04=10=26 అక్షర ఆయుధం రిపోర్టర్ ఎల్లికట్ట యాదయ్య రంగారెడ్డి జిల్లా ఉమ్మడి ఫరక్ నగర్ నందిగామ మండలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు *జంగా రజినీకాంత్ యాదవ్*, *చేవెళ్ల ఇంచార్జ్ మల్లేశ్*,ఫరూఖ్ నగర్ మండల నాయకులు శ్రీనివాస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదయ్య రజక ,బాలకృష్ణ యాదవ్ ని కలిసి రాష్ట్రంలో బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల రాజకీయ ఎదుగుదల, రాజ్యాధికారం కోసం తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణపై వారు విస్తృతంగా చర్చించారు. సమాజంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అన్నీ ఐక్యంగా ఉండాలని కోరారు అలాగే మనల్ని తెలంగాణలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బిసి ఎస్సి ఎస్టీలైన బహుజనులను రాజకీయంగా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్న అగ్రకుల నాయకులను రాజకీయంగా బొంద పెడదాం మన హక్కులను మనం సాధించుకోవడానికి బీసీ ఎస్సీ ఎస్టీలైన బహుజనులు అందరూ కలిసి పనిచేయాలని కోరారు.