Header
05 Nov 2026 | 03:44 PM

బాధిత గొర్రెల కాపరికి అండగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ సెప్టెంబర్ 29 పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కృష్ణయ్య కె పాల్ కొండమడుగు సమీపంలో గొర్రెల పైకి రైలు దూసుకెల్లడంతో సుమారు 350 గొర్రెలు మృతి చెందాయి.ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడు కృష్ణయ్యను పరామర్శించారు.బాధిత కుటుంబానికి తక్షణ అండగా నిలుస్తూ రూ.1,00,000/- ఆర్థిక సహాయం అందజేశారు.అంతేకాకుండా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అలాగే షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్ మరియు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధిత గొర్రెల కాపరికి ప్రభుత్వపరంగా నిబంధనల ప్రకారం పూర్తి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.