Header
05 Nov 2026 | 03:46 PM

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న వలిగొండ పోలీసులు

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 13 వలిగొండవిధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వలిగొండ పోలీసులకు సోమవారం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు లభించాయి.గత నెల21,29 తేదీలలో జరిగిన డీజిల్ దొంగతనం కేసులను చాకచక్యంగా ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన వలిగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తో పాటు కానిస్టేబుళ్లువెంకన్న, దామ సురేష్, నిరంజన్, సతీష్,లనుజిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ వారికి ప్రశంసా పత్రాలను అందజేసి, వారి సేవలను కొనియాడారు. నేరాల నియంత్రణలో, శాంతిభద్రతల పరిరక్షణలో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.ఎస్పీ చేతుల మీదుగా సత్కారం పొందడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. వారికి ప్రశంసా పత్రాలు రావడం పట్ల మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.