Header
05 Nov 2026 | 03:45 PM

కోర్టు కేసుల పురోగతి, ఈ-సమ్మన్ల అమలుపై సమీక్ష సమావేశం

కేసుల్లో నేర నిరూపణ శాతం పెంచేందుకు సమన్వయంతో పనిచేయాలి – జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 17 యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ అధ్యక్షతన భువనగిరి డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో కోర్టు సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేశవ్ రెడ్డిని ఎస్పీ సన్మానించి అభినందించారు. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సీడీఓ వీరారెడ్డిని అభినందించారు.అనంతరం పోలీస్ స్టేషన్ల వారీగా ఈ-సమ్మన్ల అమలు, ఈ-సాక్ష్యా నివేదికలు, సమన్ల అప్‌డేటింగ్, పెండింగ్‌లో ఉన్న సమన్ల వివరాలు, కోర్టు కేసుల పురోగతిపై ఎస్పీ సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న సమన్లను త్వరితగతిన పరిష్కరించాలని, కోర్టు కేసుల్లో నేర నిరూపణ శాతాన్ని పెంచేందుకు పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పాయింట్ బుక్స్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని, ఎంఓ నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడుతూ, పునరావృత నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణతో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, టెక్ టీమ్ సిబ్బంది, సీడీఓలు, కోర్టు లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.