Header
05 Nov 2026 | 03:49 PM

ఆశా, అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలికుక్కునూరు ప్రాజెక్టులో ఖాళీ పోస్టులకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలిపోలవరం కేంద్రంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఏర్పాటు చేయాలి: సీఐటీయూ

అక్షర ఆయుధం అక్టోబర్:6 రిపోర్టర్( బుయ్యన శ్రీను) ఆశా, అంగన్వాడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు పి.భారతి, మడవి దుర్గారావు, శుక్లబోయిన రాంబాబు డిమాండ్ చేశారు.మంగళవారం పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా, అంగన్వాడీ కార్మికుల సమస్యలపై వేర్వేరుగా వినతిపత్రాలు అంద జేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యశాఖలో నిరంతరం సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సెలవులు, టీఏ, డీఏ సౌకర్యాలతో పాటు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం శిక్షణ పొందిన ఆశాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలని కోరారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసి, మినీ అంగన్వాడీ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.ఖాళీ పోస్టులకు వెంటనే ఇంటర్వ్యూలుకుక్కునూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టుల భర్తీకి గత మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్‌లో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇప్పటివరకు ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడం సరికాదన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, రిజర్వేషన్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.పోలవరం కేంద్రంగా ఐసీడీఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలిపోలవరం మండల కేంద్రంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం కొయ్యల గూడెంలో ఉండటంతో అంగన్వాడీ కార్మికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోలవరం మండల కేంద్రంలోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జీలుగుమిల్లి మండల కన్వీనర్ చిట్టిబొమ్మ కొండలరావుతో పాటు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.