-ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్
వలిగొండ జూన్ 17 ప్రజా ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బయటాయించి ధర్నా నిర్వహించి *ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉప్పుల శాంతి కుమార్ ఎల్లంకి మహేష్ సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలకు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా పాఠశాలకు ఉండవలసిన అనుమతులు ఏమి లేకుండా ఫైర్ సేఫ్టీ పాటించకుండా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పాఠశాల ప్రిన్సిపల్ ను పర్మిషన్ సంబంధించి వివరాలు అడగగా సమాధానం ఇవ్వకపోవడంతో సంబంధిత ఎంఈఓ గారిని ఫోన్లో వివరణ కోరగా పర్మిషన్ సంబంధించి ఇంకా అప్రూవల్ ఇంకా కాలేదని ఆయన తెలిపారు అని వారన్నారు. పాఠశాలకు ఆట స్థలం లేకుండా, ఇరుకు గదులలో నిర్వహిస్తూ విద్యార్థులను బందీలు లాగా ఉంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలకు పక్కనే భీమలింగం కత్వ కాలువ ఉందని విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీ చైతన్య తో పాటు మండలంలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ విచ్చలవిడిగా పుస్తకాలు యూనిఫామ్ తదితర వస్తువుల పేరుతో ఫీజులు దోపిడి చేస్తున్నారని ప్రైవేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నామన్నారు
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు ఇష్టం ఉన్నట్లుగా ఫీజులను వసూలు చేస్తూ పుస్తకాలను విక్రయిస్తున్నారని వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో *ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు మారోజు నరసింహ చారి,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సూరారం కళ్యాణ్, ఏఐవైఎఫ్ మండల సమితి సభ్యులు కనకబోయిన నందు, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంజయ్ తదితరులు పాల్గొన్నారు.