అక్షర ఆయుధం న్యూస్: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల ఉత్కంఠ రేపుతోంది. ఫలితాలు ఆసక్తిగా ఉన్నాయి. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నందికొండలో 12 వార్డులు ఉండగా.. 11 చోట్ల కాంగ్రెస్‌ విజయ దుందుబి మోగించింది. కాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లా మధిర 10వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి బోడేపూడి రేవతి గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెదపూడి సుధాకర్‌పై ఆమె విజయం సాధించారు. కాగా మధిర, అశ్వారావుపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ అధికార పార్టీ వశమైంది. మొత్తం 12 వార్డుల్లో  కాంగ్రెస్: 07, BRS: 04,  BJP: 01 ఒక చోట గెలుపొందాయి. మంచిర్యాలలో బోణి ‌కొట్టింది CPI.  క్యాతపల్లి మున్సిపాలిటీలోని ఓ వార్డులో విజయం సాధించింది. 19వ వార్డు CPI అభ్యర్థి మిట్టపల్లి సరిత శ్రీనివాస్ గెలుపొందారు. 456 ఓట్లతో CPI అభ్యర్థి విజయం సాధించారు. కౌంటింగ్ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపులో నేతలు నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ఎన్నికల సిబ్బందిపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *