అక్షర ఆయుధం న్యూస్: ప్రేమ గుడ్డిదని అంటారు, కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రేమ కొన్నిసార్లు మతిమరుపు అని కూడా అనిపిస్తుంది. వాలెంటైన్స్ డేకి ముందు, ఒక వ్యక్తి తన స్నేహితురాలిని సంతోషపెట్టడానికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆ క్షణం ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని భావించాడు. అయితే సంచలన ట్విస్ట చోటు చేసుకుంది. ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. సూటు, బూటు ధరించిన ఒక వ్యక్తి వీధిలో తన స్నేహితురాలి కోసం రొమాంటిక్ డేట్ ఏర్పాటు చేశాడు. అతను టేబుల్ మీద ఎర్రటి హీలియం బెలూన్లతో కట్టిన పెద్ద గిఫ్ట్ బాక్స్ ఉంచాడు. ఆ అమ్మాయి ఉత్సాహంగా పెట్టెను తెరుస్తుండగా, బెలూన్ల నుండి $2,000 (రూ.1.81 లక్షలకు పైగా) నోట్ల పొడవైన దారం గులాబీ రంగు కాంతితో బయటకు వచ్చింది. దీంతో ఆ అమ్మాయి డబ్బు చూసి ఆనందంతో దూకి తన ప్రియుడిని కౌగిలించుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరి కౌగిలింతలో, ఆ వ్యక్తి చేతిలోని నోట్ల ఉన్న తీగను చేజార్చుకున్నాడు. అతను పెట్టెకు తీగను కట్టకపోవడంతో, 2,000 డాలర్ల నోట్లు తక్షణమే బెలూన్ల మాదిరిగా ఆకాశంలో ఎగిరిపోయాయి. ఆ తర్వాత ఒక వ్యక్తి దిగ్భ్రాంతికి గురై బెలూన్లను పట్టుకోవడానికి విఫలయత్నం చేసి, షాక్‌తో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఈ వీడియో చివర్లో, అతని స్నేహితురాలు అతన్ని ఓదార్చుతూ కనిపించింది. కానీ అప్పటికి నోట్లు గాలిలో ఎగురుతూ.. మేఘాలను చేరుకున్నాయి. ఆ వ్యక్తి తన స్నేహితురాలితో, “ఇది నా నెలవారీ సంపాదన” అని చెప్పి బోరుమన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *