05 Jul 2026 | 02:38 PM

పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పై సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ఆందోళన

అక్షర ఆయుధం న్యూస్ మే 30 (రిపోర్టర్ రవి)దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు, ప్రజలు వాడుకునే నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని కోరుతూ,మండల కేంద్రాలలో.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపులో భాగంగా, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కుకునూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మే 30న కుక్కునూరు మండల తహసిల్దార్ ని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి లీటరుకు 8 రూపాయలు దేశ ప్రజలపై భారం మోపిందని,14 ఏళ్ల క్రితం వంటగ్యాస్ 400 రూపాయలు ఉన్న ధర 1100 కు, పెట్రోల్ 65 నుండి 110 రూపాయలు, డీజిల్ 41 నుండి 95 రూపాయలు, వంట నూనె 90 నుండి 190, కందిపప్పు 70 నుండి 160, గోధుమపిండి 18 రూపాయల నుండి 38, ఉల్లి టమాట ఇతర కూరగాయలు 200 శాతం పెరిగాయి. కాంప్లెక్స్, రసాయనిక ఎరువులు బస్తాకు 200 రూపాయలు పెరిగాయి. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని ఎం ఎస్ పి చట్టం కొరకు రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కోరుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కంగాల కల్లయ్య, పార్టీ డివిజన్, మండల కమిటీ సభ్యులు ఎస్కే మున్ని, పెంకె వీరబాబు, మడకం మల్లేష్, మచ్చ మత్తమ్మ, పి దుర్గమ్మ, వెంకటేశ్వర్లు .రాములు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper