*దళితుల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదనంగా 5లక్షల రూపాయలు కేటాయించాలి* *సిర్పంగి స్వామి* *వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు*
*వలిగొండ జూన్ 25 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్*దళితవాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత లబ్ధిదారులకు అదనంగా 5 లక్షల రూపాయలు కేటాయించాలని వలిగొండ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. గురువారం వలిగొండ మండల కేంద్రంతో పాటు, దాసిరెడ్డిగూడెం లో దళిత వాడల సర్వే -సమస్యలపై పోరుబాట పేరుతో జూన్ 25 నుండి జులై 25 వరకు రాష్ట్ర కమిటీ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిన నేటికీ దళితవాడల పరిస్థితి యదావిధంగా కొనసాగుతుందని ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన దళితుల జీవితాల్లో ఏమాత్రం మార్పులు రావడంలేదన్నారు. దళిత వాడల అభివృద్ధి ఇంకా దూరంలోనే ఉన్నాయని వెంటనే ప్రభుత్వం దళితవాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో దళితులకు ప్రత్యేక కోటా కింద ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షలకుతోడు మరో 5 లక్షల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు.దళితులకు వృద్ధాప్య పెన్షన్ 55 సంవత్సరాలకే ఇవ్వాలని, అన్ని దళితవార్డుల్లో ప్రభుత్వం వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వలిగొండ మండల కేంద్రంలో పోలేపాక లక్ష్మయ్య, ఇంటి పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మోరి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని, దాసిరెడ్డిగూడెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు కొండూరు సత్తయ్య, మండల నాయకులు కొమ్ము స్వామి, కందుల బాలయ్య, అండాలు, దళిత కాలనీ ప్రజలు పోలేపాక లక్ష్మయ్య, ఎల్లంకి పాండు, బండారి కృష్ణ,రాపోలు కిష్టయ్య, నరసింహ,ప్రకాష్, నరేష్,యాదమ్మ,తదితరులు పాల్గొన్నారు.