04 Sep 2026 | 03:46 PM

చలో సెక్రటేరియట్ ముట్టడికి మాలలు తరలిరావాలి

-కూచిమల్ల నాగేష్,మాల మహానాడు మండల అధ్యక్షులు

వలిగొండ ఆగస్టు 28 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు కూచిమల్ల నాగేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మాలలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయడానికి చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు కూచిమల్ల నాగేష్ మాట్లాడుతూ మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించేందుకు రోస్టర్ విధానాన్ని సవరించాలని జాతీయ మాల మహానాడు పిలుపుమేరకు ఆగస్టు 31న నిర్వహించే చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి మండలంలోని ప్రతి గ్రామం నుండి మాల విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు పెద్ద సంఖ్యలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు రాపోలు పవన్ కుమార్, మండల ఉపాధ్యక్షులు పుర్మ అంజయ్య, సహాయ కార్యదర్శి కట్ట సురేష్, దాసరి లింగస్వామి, రాపోలు కృష్ణ, రాపోలు మూర్తి, రామలింగం, రాపోలు రమేష్, కేతం ఇంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper