అక్షర ఆయుధం: ఒక తల్లి తన బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది..ఆ బిడ్డ పుట్టాక తండ్రి తన భుజాలపై మోసుకుంటూ ఆమెకు ప్రపంచాన్ని చూపిస్తాడు. తండ్రి అంటే ఆకాశం. ఒక తండ్రికి తన కూతురు జీవితం కంటే గొప్పది ఇంకేది ఉండదు.. అలాంటిది తండ్రి లేని ఒక కూతురు తన పెళ్లి రోజున తన తండ్రి మాటలు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలించింది. నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షల వర్షం కురిపించారు. సైన్స్ గర్ల్’ ( @sciencegirl ) అనే X ఖాతాలో షేర్ చేయబడింది. ఈ పోస్ట్‌కు ప్రేమ అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే చెరగని జ్ఞాపకం అనే శీర్షికతో షేర్ చేశారు. కొత్తగా పెళ్లైన జంట వేదికపై నిలబడి ఉంది. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక సీతాకోకచిలుక వధువు చుట్టూ ఎగురుతూ ఆమె చేతిలో ఉన్న పూల గుత్తిపై వాలుతుంది. ఆ తర్వాత, ఆమె తలపై ధరించిన దుపట్టాపై కూర్చుని ఆమెను ఆశీర్వదిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో తన తండ్రి సీతాకోకచిలుక రూపంలో వచ్చాడనే విషయాన్ని గుర్తుచేసుకుని వధువు భావోద్వేగానికి గురవుతుంది. ఆమె భర్త కూడా సీతాకోకచిలుకను వెంబడిస్తూ కనిపించాడు. Post navigation ప్రేమలో ఓవర్ యాక్షన్… గాలిలో కలిసిన రెండు లక్షలు! ఐదు దశాబ్దాలకు పైగా మైనర్లతో లైంగిక వేధింపు… టీచర్ ముసుగులో కీచకుడు…