పల్సం సతీష్ గౌడ్
వలిగొండ సెప్టెంబర్ 2 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై బీజేపీ దుండగులు దాడి చేయడాన్ని మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పల్సం సతీష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి బీజేపీ నాయకత్వం పిరికి పందల చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 40 ఏళ్ల తర్వాత భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేయడం పట్ల కాంగ్రెసు శ్రేణులు తగిన
గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.