04 Sep 2026 | 01:31 PM

ఆరోపణలను ఖండించిన మండల అధ్యక్షులు విజయ్ నాయుడు

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పై వస్తున్న విమర్శలకు కౌంటర్

చర్ల  ఆగస్టు 30 (అక్షర ఆయుధం న్యూస్): భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుపై వస్తున్న ఆరోపణలను చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు ఖండించారు. రాజకీయ విమర్శలు చేయడం సులభమే కానీ, ఆరోపణలకు ఆధారాలు చూపడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.ఎమ్మెల్యేపై “మాఫియా” అంటూ ఆరోపణలు చేయడం కంటే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడితే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని విజయ్ నాయుడు సూచించారు.ఎమ్మెల్యే  పీఏ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్న వారు, ఆ ఆరోపణలకు ఆధారాలు ఉంటే సంబంధిత అధికారులను ఆశ్రయించి నిజానిజాలను నిరూపించాలని అన్నారు. కేవలం రాజకీయ వేదికలపై ఆరోపణలు చేయడం వల్ల వాస్తవాలు మారవని పేర్కొన్నారు.25 వేల మెజారిటీతో ఓడిస్తాం, అంటూ ముందుగానే ఎన్నికల ఫలితాలను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని విజయ్ నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారే నిర్ణయిస్తారని, ప్రజల తీర్పును ముందుగానే ఎవరూ రాసుకోలేరని అన్నారు.ప్రజల మధ్య ఎవరు ఉంటున్నారు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరు స్పందిస్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తున్నారు అనే విషయాలను ప్రజలు గమనిస్తున్నారని విజయ్ నాయుడు తెలిపారు. మాటలతో కాదు,చేసిన పనులతోనే సమాధానం చెబుతాం. ప్రజలే మా బలం,ప్రజల తీర్పే మా నమ్మకం, అని అన్నారు.రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు స్పష్టం చేశారు.

🌐 Select Language:
📰 ePaper